మీరట్ ఘోరం: కారు బోనెట్‌పై భార్యను వంద మీటర్లు ఈడ్చుకెళ్లిన భర్త
రిపోర్టర్: అశోక్
స్థలం: Meerut
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నగరంలో భర్త అక్రమ సంబంధాన్ని ప్రశ్నించిన భార్య సునీత సింగ్‌ను కారు బోనెట్‌పై వంద మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన సంచలన ఘటన కలకలం రేపింది. లోహియానగర్ ప్రాంతంలో మరో మహిళతో కారులో ఉన్న మయాంక్ సింగ్‌ను భార్య నిలదీయగా, అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మయాంక్ సింగ్, మరో మహిళ మాహి వర్మను అరెస్ట్ చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.