స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలి: ముక్తేశ్వరంలో నేతల పిలుపు

రిపోర్టర్: Y.V.RAMANA స్థలం: ఐనవిల్లి

ఐనవిల్లి మండలం ముక్తేశ్వరంలో జరిగిన బీజేపీ మండల కార్యవర్గ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు గ్రామస్థాయిలో ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.