సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ విపక్ష ఎంపీల భారీ నిరసన
రిపోర్టర్: సతీష్
స్థలం: న్యూఢిల్లీ
ఓటర్ల జాబితా సవరణ వివాదంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష కూటమి ఎంపీలు ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వైపు సాగిన ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఎంపీలు రోడ్డుపైనే బైఠాయించి తీవ్ర నిరసన తెలిపారు.