బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల ప్రవర్తించిన పోలీసులను గుర్తించాలని హైకోర్టు ఆదేశం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించాలని రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సదరు పోలీసు అధికారుల పూర్తి వివరాలను వెంటనే స్పీకర్‌కు అందజేయాలని డీజీపీని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ ఘటన అసెంబ్లీ ప్రాంగణంలో జరిగినట్లయితే, ఆ పూర్తి వివరాలను కోర్టుకు నివేదించాలని స్పష్టం చేసింది. అసెంబ్లీ నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకునే పూర్తి అధికారం కేవలం స్పీకర్‌కే ఉంటుందని హైకోర్టు తేల్చిచెప్పింది.