నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
రిపోర్టర్: గోపి
స్థలం: తెలంగాణ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోర్ అర్బన్ రీజియన్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. మున్సిపాలిటీల సవరణ బిల్లు, ప్రజా విశ్వాసం నిబంధనల సవరణ బిల్లులను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సభ ముందుకు తెస్తారు. జనగణనలో బీసీ, ఓబీసీల లెక్కల సేకరణపై మరియు విద్యారంగ బలోపేతంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది.