విద్యార్థులకు అలర్ట్: సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష దరఖాస్తులు ప్రారంభం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: న్యూఢిల్లీ
దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూళ్లలో ఆరో తరగతి మరియు తొమ్మిదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే అఖిల భారత సైనిక్ పాఠశాలల ప్రవేశ పరీక్షకు ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైనట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు వెల్లడించారు. ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ రెండవ తేదీ వరకు గడువు ఉందని, ఆసక్తి గల విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.