మెగాస్టార్ చిరంజీవి కాకా సినిమా పాత్రపై ఆసక్తికర విశేషాలు

రిపోర్టర్: సతీష్ స్థలం: Hyderabad

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కాకా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి కదిరి కాళిదాస్ అలియాస్ సత్యం అనే రెండు విభిన్న కోణాలు ఉన్న పాత్రలో కనిపించనున్నారు. ఆక్వా ఫ్యాక్టరీ సూపర్‌వైజర్‌గా సత్యం పాత్ర, తెరవెనుక అండర్‌వాల్డ్ వ్యవహారాలను శాసించే కదిరి కాళిదాస్‌గా ఆయన ద్విపాత్రాభినయం అలరించనుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.