'నా ఆత్మకు శాంతి కలగాలంటే ఎవరినీ వదలొద్దు': విజయనగరం జేఎన్టీయూ ఉద్యోగి సంతోష్ ఆత్మహత్య లేఖ కలకలం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: విజయనగరం
విజయనగరం జేఎన్టీయూ గురజాడ పరీక్షల విభాగంలో జరిగిన అక్రమాలపై పొరుగుసేవల ఉద్యోగి సంతోష్ ఆత్మహత్యకు ముందు రాసిన లేఖ తీవ్ర కలకలం రేపింది. మూడేళ్లుగా పరీక్షల విభాగంలో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, కొందరి తప్పుల కారణంగా తనను బలి చేశారని వీసీని ఉద్దేశించి రాసిన లేఖలో సంతోష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉపకులపతి ఆచార్య వి.వి.సుబ్బారావు స్పందించి ఫోర్మెన్ కమిటీని ఏర్పాటు చేయగా, రాష్ట్ర ఉన్నత విద్యామండలి నివేదిక కోరింది.