ఎన్నికల సంఘం తీరుపై వైఎస్ జగన్ తీవ్ర నిప్పులు
రిపోర్టర్: మహేష్
స్థలం: అమరావతి
రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం పూర్తిగా చంద్రబాబు నాయుడుకు తొత్తుగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. పులివెందులలో రిగ్గింగ్ జరిగిందని, అన్ని బూట్లలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.