ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్పై జిజి థామ్సన్ సంచలన ఆరోపణలు

రిపోర్టర్: నరేష్ స్థలం: New Delhi

కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తనను బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయాలని కోరారని కేరళ మాజీ ప్రధాన కార్యదర్శి జిజి థామ్సన్ ఆరోపించారు. 2016లో ఢిల్లీకి వెళ్తున్న విమానంలో ఈ చర్చ జరిగిందని ఆయన ఓ స్థానిక మీడియాకు తెలిపారు. ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్న సమయంలో జ్ఞానేశ్ కుమార్ బీజేపీ కోసం పనిచేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం వర్గాలు ఇంకా ఎలాంటి అధికారిక స్పందన తెలపలేదు.