సకాలంలో చికిత్స పొందితే పాముకాటు ప్రాణాపాయం తప్పుతుందన్న మంత్రి సత్యకుమార్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అమరావతి
సకాలంలో చికిత్స పొందితే పాముకాటు ప్రాణాపాయం నుంచి పూర్తిగా బయటపడొచ్చని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అంతర్జాతీయ పాముకాటు అవగాహన వారోత్సవాల గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రంలో గత మూడేళ్లలో 4,800 పాముకాటు కేసులు నమోదయ్యాయని, శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక కేసులు వెలుగుచూశాయని మంత్రి తెలిపారు.