ఇంటినే గణేశ్ మ్యూజియంగా మార్చిన భక్తుడు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: గుజరాత్

గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చెందిన దిలీప్ ధ్రువ్ వినాయకుడిపై ఉన్న భక్తితో గత 40 ఏళ్లుగా వివిధ దేశాల నుంచి 3,000లకు పైగా గణేశ్ విగ్రహాలు, కళాఖండాలను సేకరించి తన ఇంట్లోనే మ్యూజియంగా ఏర్పాటు చేశారు. నిమజ్జనం చేయకుండా విగ్రహాలను భద్రపరుస్తున్న ఆయన ఇంటిని చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.