ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ ప్రకటనపై భారత్ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: నరేష్ స్థలం: న్యూఢిల్లీ

కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారుల అదుపుపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ వ్యక్తం చేసిన ఆందోళనలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఇది దేశ అంతర్గత వ్యవహారాల్లో అనవసర జోక్యమని భారత్ స్పష్టం చేసింది. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, శాంతియుత సమావేశాల హక్కును రాజ్యాంగం గ్యారెంటీ ఇస్తోందని న్యూఢిల్లీ తరఫున అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అధికారులు వెల్లడించారు.