మంచిర్యాల క్రిటికల్ కేర్ ఆసుపత్రి పనులను వేగవంతం చేయాలన్న కలెక్టర్

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

మంచిర్యాలలో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా కాలేజ్ రోడ్డులో కొనసాగుతున్న క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా సందర్శించి పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.