మేడిగడ్డ నీటి ఎత్తిపోతలపై రేవంత్ సర్కార్ తీరును నిలదీసిన కౌశిక్ రెడ్డి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
మేడిగడ్డ నీటిని ఎత్తిపోయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం కృత్రిమ కరువును సృష్టించిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల వేయి టీఎంసీల నీరు వృథా అయ్యాయని ఆరోపించారు. క్రాప్ హాలిడే ప్రకటించే హక్కు ప్రభుత్వానికి లేదని స్పష్టం చేస్తూ, ఎండిపోయిన ప్రతి ఎకరాకు యాభై వేల రూపాయల పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.