థానే వాసులకు దీపావళి కానుక: నీటి సరఫరా బంద్ను రద్దు చేసిన ఎండీసీ

రిపోర్టర్: శివ స్థలం: థానే

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని థానే జిల్లాలో ఈ గురువారం తలపెట్టిన ముప్ పై ఆరు గంటల నీటి సరఫరా నిలిపివేతను రద్దు చేస్తున్నట్లు మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీకాంత్ రౌత్ వెల్లడించారు. ఈ నిర్ణయంతో స్థానిక ప్రజలకు పెద్ద ఎత్తున ఊరట లభించిందని, తదుపరి షట్ డౌన్ తర్వాతి వారం నుంచి యథావిధిగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. పండుగ వేళ తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.