విశాఖలో హెచ్పీసీఎల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం: ఎగిసిపడిన మంటలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నం హెచ్పీసీఎల్ రిఫైనరీ ప్రాంగణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. రిఫైనరీలోని పిచ్ టవర్ యూనిట్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో దట్టమైన నల్లటి పొగలు నగరంలో అలముకున్నాయి. ఈ ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.