దీపాలతో ‘మోదీ’ పేరు.. జన్మదిన శుభాకాంక్షలు
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మండలంలోని రెడ్డిబావిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గుండ్లబావి గ్రామ సర్పంచ్ నందగిరి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో దీపాలతో మోదీ పేరును అందంగా ఏర్పాటు చేసి ఆశీర్వాద దీపం వెలిగించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి నాయకులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.