మాజీ మంత్రి హరీశ్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన పెద్ది స్వప్న

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

హైదరాబాద్లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావును వరంగల్ జడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ యోగక్షేమాలను హరీశ్ రావు అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి నర్సంపేట నియోజకవర్గ ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని, నియోజకవర్గ పరిస్థితులపై సమగ్ర సమీక్ష నిర్వహిస్తామని ఈ సందర్భంగా హరీశ్ రావు స్పష్టం చేసినట్లు పార్టీ శ్రేణులు వెల్లడించాయి.