ఆచంట వైసీపీలో వారసత్వ రాజకీయాలు: రంగనాథరాజు స్థానంలో కొడుకు నరేష్?

రిపోర్టర్: కృష్ణ స్థలం: పశ్చిమ గోదావరి

ఆచంట వైసీపీలో సమన్వయ లోపం, అంతర్గత విభేదాలతో రాజకీయాలు వేడెక్కాయి. మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో, ఆయన స్థానంలో తనయుడు నరేష్ రాజును ఇంచార్జ్‌గా నియమించే యోచనలో అధిష్టానం ఉంది. రంగనాథరాజును నరసాపురం ఎంపీగా పోటీ చేయించే అవకాశం ఉండటంతో, ఆచంట పగ్గాలను వారసుడికి అప్పగించే దిశగా వైసీపీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఈ మార్పుపై క్యాడర్‌లో ఆసక్తి నెలకొంది.