రణబాలి సినిమా ట్రైలర్ విడుదల తేదీ ఖరారు: ఈ నెల 8న రాక

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

విజయ్ దేవరకొండ మరియు రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం రణబాలి సినిమా ట్రైలర్ ను ఈ నెల 8వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చారిత్రాత్మక సినిమాను విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.