విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధా నామినేషన్ దాఖలు
రిపోర్టర్: రమేష్
స్థలం: విజయవాడ
విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ ఆదివారం తన నామినేషన్‌ను దాఖలు చేశారని వంగవీటి రాధా తెలిపారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి, కూటమి పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ల సహకారంతో విజయవాడను అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తామని వంగవీటి రాధా ధీమా వ్యక్తం చేశారు. కాగా ఈ ఎన్నికల్లో ఏబీ వెంకటేశ్వరరావు, వైసీపీ అభ్యర్థి రాయని భాగ్యలక్ష్మి కూడా నామినేషన్లు దాఖలు చేశారు.