'సెప్టెంబర్ 18న హతః టీజర్': కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ప్రకటన
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
యువ నటుడు కిరణ్ అబ్బవరం నిర్మాతగా వ్యవహరిస్తున్న కొత్త మిస్టరీ థ్రిల్లర్ చిత్రం హతః టీజర్ విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అనుష్ గోరక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 18న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. శివశంకర నాయుడితో కలిసి కిరణ్ అబ్బవరం ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండగా, ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది.