ఉత్తరాంధ్రలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం: భారీగా తరలివచ్చిన ఓటర్లు

రిపోర్టర్: కిరణ్ స్థలం: విశాఖపట్నం

ఉత్తరాంధ్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అత్యంత ప్రశాంత వాతావరణంలో ముగిసిందని అధికారులు తెలిపారు. విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, మన్యం మరియు శ్రీకాకుళం జిల్లాల్ లో ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులు సైతం ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. వివిధ ప్రాంతాల్ లో ప్రముఖులు, ప్రజాప్రతినిధులు క్యూలైన్లలో నిలబడి ఓటు వేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు.