ముంబైలో బ్రిస్టల్ విశ్వవిద్యాలయ ఎంటర్‌ప్రైజ్ క్యాంపస్ ఏర్పాటు

రిపోర్టర్: విజయ్ స్థలం: ముంబై

భారతీయ విద్యార్థులకు మరింత అందుబాటులో ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ ముంబైలో నూతన ఎంటర్‌ప్రైజ్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని ఆ విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎవ్లిన్ వెల్చ్ వెల్లడించారు. విదేశాలకు వెళ్లే ఖర్చులో మూడో వంతు ఖర్చుతోనే విద్యార్థులు స్థానికంగా ఉంటూ గ్లోబల్ ఎడ్యుకేషన్ పొందవచ్చని, ఇది భారత్-బ్రిటన్ దేశాల మధ్య దీర్ఘకాలిక విద్యా భాగస్వామ్యానికి దోహదపడుతుందని ఆమె తెలిపారు.