ఓటర్ల జాబితా సవరణను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది: జేపీ నడ్డా ధ్వజం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Bhopal

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భోపాల్ లో నిర్వహించిన పాదయాత్రలో ఆయన మాట్లాడుతూ, బయటి వ్యక్తులను కాపాడుకునేందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘంపై నిరాధార ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలను బలహీనపరిచేలా ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించాలని నడ్డా పిలుపునిచ్చారు.