భర్త చివరి కోరిక తీర్చిన జపాన్ మహిళ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: उत्तराखंड
ఉత్తరాఖండ్‌లోని బాఘేశ్వర్‌లో అమెరికాకు చెందిన తన భర్త రాబర్ట్ క్యాట్లెట్ అస్థికలను సరయూ నదిలో నిమజ్జనం చేసి చివరి కోరికను నెరవేర్చింది జపాన్‌కు చెందిన మీకో క్యాట్లెట్. 2005లో యోగా క్యాంపులో పరిచయమై వివాహం చేసుకున్న వీరు, 2007లో బాఘేశ్వర్‌ను సందర్శించారు. 2022లో రాబర్ట్ అనారోగ్యంతో మరణించగా, భర్త కోరిక మేరకు ఆమె జపాన్ నుంచి వచ్చి వైదిక సంప్రదాయాల ప్రకారం ఈ కార్యక్రమం పూర్తి చేసింది.