భారీ అంచనాల మధ్య కల్కి సీక్వెల్ షూటింగ్ ప్రారంభం
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంచలన చిత్రం కల్కి 2898 ఏడీ సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. తొలి భాగం ఘనవిజయం సాధించి రెండు నేషనల్ అవార్డులు సొంతం చేసుకోవడంతో ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని 2027 మధ్య నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.