రూపాయల నలభై ఆరు కోట్ల చెక్కుల వివాదంలో నటి రాధ విచారణ
రిపోర్టర్: రాము
స్థలం: చెన్నై
నలభై ఆరు కోట్ల రూపాయల చెక్కుల దుర్వినియోగ వివాదంలో ప్రముఖ సినీ నటి రాధ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారుల ఎదుట హాజరయ్యారని పోలీసులు తెలిపారు. తన సోదరి అంబిక బ్లాంక్ చెక్కులను దుర్వినియోగం చేసి భారీ లావాదేవీలకు పాల్పడ్డారని రాధ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సీసీబీ అధికారులు ఆమెను సుమారు మూడు గంటల పాటు విచారించారు. చెక్కులు మాయమవడం, ఆర్థిక లావాదేవీల వివరాలపై ఆరా తీసినట్లు సమాచారం.