హైదరాబాద్ రంజీ జట్టు కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ నియామకం
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
భారత స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ రంజీ ట్రోఫీ 2026-27 సీజన్ కోసం హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా నియమితులయ్యారు. హెచ్‌సీఏ సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. వైస్ కెప్టెన్‌గా చామా మిలింద్ ఎంపికయ్యారు. అంతర్జాతీయ అనుభవంతో సిరాజ్ జట్టును విజయాల పథంలో నడిపిస్తారని హెచ్‌సీఏ ఆశాభావం వ్యక్తం చేసింది.