సూళ్లూరుపేటలో ఈ నెల 24న టిడ్కో ఇళ్ల పంపిణీ

రిపోర్టర్: రమేష్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని మన్నారుపోలూరు టిడ్కో గృహాలను ఈ నెల 24న లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనుండగా, అన్ని మౌలిక వసతులతో సిద్ధమైన స్వగృహాల్లోకి పేదలు అడుగుపెట్టనున్నారు.