గ్రూప్-1 మూల్యాంకనంలో భారీ అక్రమాలు తేల్చిన సిట్ నివేదిక
రిపోర్టర్: అశోక్
స్థలం: ఆంధ్రప్రదేశ్
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనంలో భారీ అక్రమాలు జరిగినట్లు సిట్ తేల్చింది. 734 ఓఎమ్మార్ షీట్లలో 718 పత్రాల్లో దిద్దుబాట్లు చేసినట్లు ఫోరెన్సిక్ విశ్లేషణలో వెల్లడైంది. ఎంపికైన 165 మందిలో 160 మంది జవాబు పత్రాల్లో మార్పులు చేశారు. ప్రైవేట్ రిసార్టులో అసలు పత్రాలను దాచి, డూప్లికేట్ పత్రాలు ముద్రించి కుంభకోణానికి పాల్పడినట్లు సిట్ తుది నివేదికలో స్పష్టం చేసింది.