నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్ లో వైకాపా ఘోర పరాజయం: కేవలం ఒకే సీటు దక్కించుకున్న వైనం
రిపోర్టర్: అశోక్
స్థలం: నెల్లూరు
నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల్ లో వైకాపా ఘోర పరాజయం చవిచూసింది. గతంలో అన్ని డివిజన్లను కైవసం చేసుకున్న ఆ పార్టీ, ఈసారి కేవలం పదమూడో డివిజన్ లో మాత్రమే విజయం సాధించిందని అధికారులు తెలిపారు. వ్యూహాలు ఫలించక అభ్యర్థులు తేలిపోగా, కూటమి నాయకులు సునాయసంగా గెలుపొందారు. కొన్ని స్థానాల్ లో స్వతంత్రులే గట్టి పోటీ ఇచ్చారని, పలువురు అభ్యర్థులు డిపాజిట్లు కూడా కోల్పోయారని విశ్లేషకులు వెల్లడించారు.