ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించబోమని బ్రిక్స్ దేశాల స్పష్టం

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించమని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించమని బ్రిక్స్ దేశాధినేతలు స్పష్టం చేశారు. భారత్ వేదికగా జరిగిన పద్దెనిమిదో బ్రిక్స్ సమావేశంలో పహల్గాం ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించారు. న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో సీమాంతర ఉగ్రవాదంపై పిడికిలి బిగించారు. ఉగ్రవాదాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించాలని, ద్వంద్వ ప్రమాణాలు పాటించవద్దని తీర్మానించారు.