వినాయక చవితి సెలవులతో ఖాళీ అవుతున్న భాగ్యనగరం

రిపోర్టర్: వెంకట్ స్థలం: హైదరాబాద్

వినాయక చవితి వరుస సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ ఖాళీ అవుతోంది. నగరవాసులు సొంతూళ్లకు పయనం కావడంతో బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. జాతీయ రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రధాన టోల్‌గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి.