జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నికలు: జనసేన అభ్యర్థిగా వాసిరెడ్డి పద్మ కుమార్తె ఘనవిజయం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: NTR District
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్ లో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పరిధిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కుమార్తె మేఘన జనసేన పార్టీ అభ్యర్థిగా 31వ వార్డు నుంచి బరిలోకి దిగి ఘనవిజయం సాధించినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో ఆమె తన సమీప ప్రత్యర్థిపై 540 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించడంతో జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.