జాతి వివక్ష వ్యాఖ్యల కేసులో కంటెంట్ క్రియేటర్ అమీర్ షౌకీన్ అరెస్ట్
రిపోర్టర్: అశోక్
స్థలం: దిల్లీ
ఈశాన్య రాష్ట్రాల యువకుడిపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసి వీడియో వైరల్ కావడంతో అరెస్టయిన కంటెంట్ క్రియేటర్ అమీర్ షౌకీన్ను పోలీసులు అహ్మదాబాద్‌కు తరలించి క్రైమ్ సీన్ రీక్రియేషన్ చేపట్టారు. దిల్లీ పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడు మీడియాతో మాట్లాడుతూ తాను చేసిన తప్పును అంగీకరించి ఈశాన్య ప్రజలకు కన్నీటిపర్యంతమై క్షమాపణలు కోరారని, ఎవరినీ ఉద్దేశపూర్వకంగా కించపరచలేదని స్పష్టం చేశారని అధికారులు వెల్లడించారు.