పార్లమెంటరీ కమిటీ సమావేశంలో కీలక బిల్లుపై చర్చించిన నిజామాబాద్ ఎంపీ

రిపోర్టర్: గోపి స్థలం: నిజామాబాద్

నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ న్యూఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశంలో అత్యంత కీలకంగా పాల్గొని చర్చలు జరిపారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్ట సవరణ బిల్లుపై సమావేశంలో సమగ్రంగా చర్చించినట్లు ఆయన తెలిపారు. దేశ భద్రత మరియు పారదర్శకతను పెంపొందించే దిశగా ఈ సవరణలు ఎంతగానో దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో వివిధ పార్టీల ఎంపీలు అలాగే ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.