పలాస చైర్ పర్సన్ బరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా తలాసు శ్రీ పద్మ

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా తలాసు శ్రీ పద్మ పేరును పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం నేపథ్యంలో మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం ముప్పై ఆరు వార్డుల కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై స్థానిక నాయకులు మీడియా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.