వైఎస్ జగన్ను కలిసిన భీమిలి వైసీపీ సమన్వయకర్త బొత్స అనూష
రిపోర్టర్: సురేష్
స్థలం: తాడేపల్లి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించినందుకు ఆమె జగన్కు పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.