ఓటీటీకి వస్తున్న ఎం ఎస్ రాజు అగధ సినిమా
రిపోర్టర్: శివ
స్థలం: తెలంగాణ
ప్రముఖ దర్శకుడు ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం అగధ త్వరలో డిజిటల్ వేదికపైకి రానుంది. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో సెప్టెంబర్ 25 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. కంటికి కనిపించని దైవిక శక్తులు, దుష్ట శక్తుల మధ్య జరిగే పవర్ఫుల్ పోరాటమే ఈ చిత్ర కథాంశం.