నాగాలాండ్: భార్య సమాధి చుట్టూ అందమైన ఉద్యానవనాన్ని తీర్చిదిద్దిన తొంభై ఏళ్ల వృద్ధుడు

రిపోర్టర్: నరేష్ స్థలం: Nagaland

నాగాలాండ్ రాష్ట్రంలోని కిగ్వేమా గ్రామానికి చెందిన తొంభై ఏళ్ల మోసెనియి యాఖ్రో తన భార్య జ్ఞాపకార్థం ఆమె సమాధి చుట్టూ అద్భుతమైన ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారని అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. పదేళ్ల క్రితం భార్య వివోల్హెరి మరణించిన నాటి నుంచి ప్రతిరోజూ ఉదయం ఆమె సమాధి వద్ద మొక్కలను సంరక్షిస్తూ వస్తున్నారన్నారు. ఈ అందమైన తోట ఇప్పుడు పర్యాటకులను, గ్రామస్తులను ఎంతగానో ఆకట్టుకుంటూ ప్రత్యేక ప్రాంతంగా మారిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.