సర్వేపల్లి రిజర్వాయర్లో లక్షల చేపపిల్లలు వదిలి మత్స్యకారుల బతుకులకు సర్కార్ భరోసా

రిపోర్టర్: సాయి దివ్య స్థలం: వెంకటాచలం

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సర్వేపల్లి రిజర్వాయర్లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద సుమారు మూడు లక్షల పద్దెనిమిది వేల చేప పిల్లలను మత్స్యశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఉచితంగా విడుదల చేశారు. లైసెన్సు పొందిన మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరచడమే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, మత్స్యశాఖ సహాయ పరిశీలకులు వి. పొటయ్య తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.