భామిని మండలంలో రోడ్డు ప్రమాదం: లారీని తప్పించబోయి యువకుడు దుర్మరణం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: భమిని

శ్రీకాకుళం జిల్లా భామిని మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముంజేటి దామోదరనాయుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. లోహరిజోల గ్రామానికి చెందిన మణికంఠ ద్విచక్ర వాహనంపై భామిని వెళ్లి తిరిగి వస్తుండగా బురుజోల కూడలి వద్ద లారీని తప్పించబోయి బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.