అంతర్జాతీయ సదస్సులో ప్రతిభ చాటిన విజయనగరం డిగ్రీ విద్యార్థులు

రిపోర్టర్: విజయ్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా కేంద్రంలోని మహారాజా కళాశాలలో డిగ్రీ చదువుతున్న నితిన్, లావణ్య, ఆర్‌.సూర్య, ఎన్‌.హెచ్‌.రామకృష్ణ కోయంబత్తూరులో జరిగిన అంతర్జాతీయ సదస్సులో తమ పరిశోధన పత్రాలతో ప్రతిభ చాటారు. యూపీజడ్‌వై పెన్సిల్‌ బిట్జ్‌ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఐసీఎఫ్‌ఆర్‌ఐ-2026 సదస్సులో కృత్రిమ మేధ భద్రతా ముప్పు, విజయనగరం వాతావరణంలో ఏరోసాల్‌ ప్రభావాలపై ఆన్‌లైన్‌లో పరిశోధన పత్రాలు సమర్పించి నిర్వాహకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.