భారత సైన్యం కోసం వరంగల్ ఎన్ఐటీ శాస్త్రవేత్తల సరికొత్త రక్షణ ప్రాజెక్ట్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వరంగల్
వరంగల్ ఎన్ఐటీ భారత సైన్యంతో రూ.42 లక్షల రక్షణ పరిశోధన ప్రాజెక్టుపై అధికారికంగా ఒప్పందం కుదుర్చుకుంది. జీసీఎన్ఎన్ సాంకేతికతతో త్రిమితీయ వస్తువులను గుర్తించే అధునాతన కృత్రిమ మేధస్సు వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు. ప్రొఫెసర్ టి. కిషోర్ కుమార్ నేతృత్వంలో ఈ పరిశోధన కొనసాగనుంది. రక్షణ రంగంలో నూతన ఆవిష్కరణలకు ఈ ప్రాజెక్టు ఎంతో దోహదపడనుంది.