తిరుమలలో ప్రముఖుల సందడి, భారీగా పెరిగిన భక్తుల రద్దీ

రిపోర్టర్: కిరణ్ స్థలం: తిరుపతి

తిరుమల శ్రీవారిని నటి శ్రియా శరణ్, కృతిశెట్టి, ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ దర్శించుకున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల తాకిడి భారీగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా శనివారం వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి హుండీ ఆదాయం రూ.6.93 కోట్లుగా నమోదైంది.