నారాయణపేటలో గణేష్ శోభాయాత్ర బందోబస్తును పరిశీలించిన ఎస్పీ వినీత్

రిపోర్టర్: రాజేష్ స్థలం: నారాయణపేట

నారాయణపేట జిల్లా కేంద్రంలో గణేష్ శోభాయాత్ర మరియు నిమజ్జనం సందర్భంగా చేపట్టిన భారీ బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు అని ఎస్పీ నారాయణపేట వెల్లడించారు. శోభాయాత్ర సాగే మార్గాలను పరిశీలించి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన ముందస్తు భద్రతా చర్యలపై పోలీసు అధికారులు మరియు సిబ్బందికి పలు కీలక సూచనలు జేశారు. పండుగ ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.