ప్రధాని మోదీ డిగ్రీ కేసులో అరవింద్ కేజ్రీవాల్కు గుజరాత్ హైకోర్టులో చుక్కెదురు

రిపోర్టర్: కిరణ్ స్థలం: గుజరాత్

ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతల వివాదంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు గుజరాత్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేయడంతో పాటు, ఆయనపై విధించిన ఇరవై ఐదు వేల రూపాయల జరిమానాను సమర్థించింది. ఆర్టీఐ నిబంధనలను దుర్వినియోగం చేశారని కోర్టు పేర్కొంది. యూనివర్సిటీని అప్రతిష్టపాలు చేసేందుకే ఈ వివాదం సృష్టించారని గుజరాత్ యూనివర్సిటీ తరఫు న్యాయవాదులు వాదించారు.