సింగరేణి ఇళ్ల స్థలాల హక్కుల దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వ ఆదేశాలు

రిపోర్టర్: రమేష్ స్థలం: తెలంగాణ

సింగరేణి బొగ్గు బెల్ట్‌ పరిధిలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాల హక్కుల దరఖాస్తులను 45 రోజుల్లోగా పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖను ఆదేశించింది. జిల్లా కలెక్టర్ అధ్యక్షుడిగా త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేసి, జీవో 76, జీవో 28 మార్గదర్శకాల ప్రకారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, పెద్దపల్లి సహా పలు జిల్లాల్లో అర్హతలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.